మోదీ మళ్లీ ప్రధాని కావడం కష్టమే... ఒడిశా సీఎం సంచలన వ్యాఖ్యలు

వాజ్‌పేయితో మోదీని పోల్చలేమన్నారు పట్నాయక్. మోదీ చెప్పింది ఏదీ చేయలేదన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు.

news18-telugu
Updated: April 15, 2019, 10:26 AM IST
మోదీ మళ్లీ ప్రధాని కావడం కష్టమే... ఒడిశా సీఎం సంచలన వ్యాఖ్యలు
నవీన్ పట్నాయక్ (File)
news18-telugu
Updated: April 15, 2019, 10:26 AM IST
ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ప్రధాని మోదీ మళ్లీ పీఎం అవుతారన్న నమ్మకం తనకు లేదన్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అప్పటి ప్రధాని వాజ్‌పేయితో తాను పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆయన సమర్థ ప్రధాని అని కొనియాడారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్న నమ్మకం తనకైతే లేదన్నారు. వాజ్‌పేయితో మోదీని పోల్చలేమన్నారు పట్నాయక్. మోదీ చెప్పింది ఏదీ చేయలేదన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు ఇంకా పరిపక్వత రాలేదన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో ఒడిశాను ఆదుకునే వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేడీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ నవీన్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. రాష్ట్రానికి సీఎం అభ్యర్థి ఎవరో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించేందుకు భయపడుతుందన్నారు. బీజేపీ నేతలు చెప్పే డబుల్ ఇంజన్ నినాదం ఒడిశాలో ఫెయిల్ అయ్యిందన్నారు పట్నాయక్.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...