ఇవాళ సాయంత్రం మోదీ కేబినెట్ తొలి భేటీ....

పార్లమెంట్ సమావేశాల నిర్వహణ తేదీపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 31, 2019, 7:49 AM IST
ఇవాళ సాయంత్రం మోదీ కేబినెట్ తొలి భేటీ....
నరేంద్ర మోదీ, కేబినెట్ మంత్రులు(Image:PIB)
  • Share this:
గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మోదీ కేబినెట్... శుక్రవారం సాయంత్రం తొలిసారిగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరగనుంది. ప్రస్తుతానికి ఈ మీటింగ్‌కు ఎలాంటి ఎజెండా నిర్ణయించలేదని, పార్లమెంట్ సమావేశాల నిర్వహణ తేదీపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. భద్రత, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీల ఏర్పాటుపైనా ప్రధాని మోదీ రాబోవు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గురువారం సాయంత్రం ప్రధానిగా మరోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 58 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో 23 మంది కేంద్రమంత్రులు. 9 మందికి స్వతంత్ర హోదాతో సహాయమంత్రులు. మిగిలిన 24మంది సహాయమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు, సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ కూడా హాజరయ్యారు.


First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు