• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • NARENDRA MODI ENTERS 20TH YEAR IN PUBLIC WITHOUT BREAK SK

Narendra Modi: ప్రధాని మోదీ కొత్త రికార్డు.. పాలకుడిగా 20 ఏళ్లు

Narendra Modi: ప్రధాని మోదీ కొత్త రికార్డు.. పాలకుడిగా 20 ఏళ్లు

ప్రధాని నరేంద్ర మోదీ

వరుసగా 20 ఏళ్ల ప్రభుత్వాధినేతగా పనిచేయడం చిన్న విషయం కాదని.. అది వన్ అండ్ ఓన్లీ మోదీకే సాధ్యమవుతుందని బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 • Share this:
  భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా..పాలకుడిగా.. నేటితో 20 ఏళ్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఈ మైలురాయిని అధిగమించారు నరేంద్ర మోదీ. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అక్టోబరు 7, 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అలా వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడుతూ కమల దళాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 2014, 2019లో ప్రధానిగా వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలా 2001 నుంచి ఇప్పటి వరకు ఇటు వ్యక్తిగతంగా.. అటు ప్రభుత్వ పరంగా.. ఓటమనేదే ఎరుగరు నరేంద్ర మోదీ.

  2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అవి విజయవంతం కావడంతో గుజరాత్ రూపు రేఖలే మారిపోయాయి. మొట్ట మొదటగా ఆయన విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. విద్యుత్ సంస్కరణలంటే ఏ ప్రభుత్వమైనా రాజకీయలను దృష్టిలో ఉంచుకొని వెనకడుగు వేస్తుంది. కానీ మోదీ అలాకాదు.. రైతులు..ప్రజల్లో విశ్వాసం చూరగొనేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుజరాత్‌లోని ప్రతి మారుమూల గ్రామానికి.. ప్రతి ఇంటికీ.. విద్యుత్‌ అందించి వెలుగులు పంచారు.

  పెట్టుబడుల వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. జాతీయ స్థాయిలోనే పెట్టుబడుల సదస్సులు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిది 2003లో రాష్ట్ర స్థాయిలో పెట్టుబడుల సదస్సును నిర్వహించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడులు రావడంతో గుజరాత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. పరిశ్రమలు, వ్యవసాయం, ఇన్‌ఫ్రా రంగాలు పురోగతిలో పయనించాయి. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు కన్యా కెలవానీ ప్రోగ్రామం చేపట్టారు మోదీ. ముఖ్యమంత్రి హోదాలో గ్రామాల్లో బసచేస్తూ పాఠశాల్లో బాలికల ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టిసారించి విజయం సాధించారు. అలా గుజరాత్ మోడల్ గురించి విశ్వవ్యాప్తంగా తెలిసింది.

  2014లో మొట్టమొదటగా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. కేంద్రంలోనూ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ, 2018లో ఆయుష్మాన్ భారత్ పథకం, 2019లో ఈబీసీ రిజర్వేషన్లు, బేటీ పడావో-బేటీ బచావో, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA).. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న చట్టాలను సైతం మార్చేశారు. మోదీ హయాంలోనే పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. గత ఏడాదిలో పాకిస్తాన్ బాలకోట్‌లో దాడులు జరిగాయి.

  ఇక ఈ సంవత్సరం యావత్ విశ్వాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ వలన కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. అన్ని రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు.. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌ను కేంద్రం ప్రకటించింది. అంతేకాదు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య రామజన్మభూమి వివాదానికి కూడా మోదీ హయంలోనే పరిష్కారం లభించింది. ఆగస్టులో అయోధ్యలో జరిగిన రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొన్నారు.

  వరుసగా 20 ఏళ్ల ప్రభుత్వాధినేతగా పనిచేయడం చిన్న విషయం కాదని.. అది వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోదీకే సాధ్యమవుతుందని బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. విశ్రాంతి లేకుండా పనిచేయడం, అవినీతి మచ్చ లేకపోవడం, అన్ని వర్గాల సంక్షేమం- దేశాభివృద్ధే లక్ష్యంగా గొప్ప దార్శనికతతో ముందుకెళ్లడమే మోదీ విజయ రహస్యాలని చెబుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు