నారాయణ విద్యాసంస్థలకు షాక్... విజయవాడలో స్కూల్ సీజ్

గుర్తింపులేని స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 1:14 PM IST
నారాయణ విద్యాసంస్థలకు షాక్... విజయవాడలో స్కూల్ సీజ్
ఏపీలో నారాయణ స్కూల్ సీజ్
news18-telugu
Updated: June 12, 2019, 1:14 PM IST
విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్ చేశారు అధికారులు. విజయవాడ, సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు... గతంలో మూడుసార్లు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఇవాళ విదయం నారాయణ స్కూల్ వద్దకు చేరుకున్న విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు.

గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ స్కూల్ ను సీజ్ చేశారు. గతంలో పాఠశాల యాజమాన్యానికి మూడు దఫాలు నోటీసులు ఇచ్చామన్నారు. స్కూల్‌పై లక్ష రూపాయల జరిమానా విధించారు. వేసవి సెలవులు ముగించుకుని నేడు (బుధవారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతుండటంతో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది. గుర్తింపులేని స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

అర్హులైన పేదలందరిని ‘అమ్మ ఒడి’ ద్వారా ఆదుకుంటామని ఏపీలో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ కూడా వేసింది. తొలి కేబినేట్‌ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలపై ‘రెగ్యులేటరీ కమిషన్‌’ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం.First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...