Home /News /politics /

NARASAPURAM LOK SABHA WINNING CHANCES FOR NAGABABU SB

నరసాపురంలో నాగబాబు పరిస్థితి ఏంటి ? ఓడిపోతున్నారా?

నటుడు నాగబాబు (ఫైల్ ఫోటో)

నటుడు నాగబాబు (ఫైల్ ఫోటో)

సర్వే రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలు ఉండగా టీడీపీకి 17 స్థానాలు, వైసీపీకి 8 స్థానాలు దక్కుతాయని ఉంది. అయితే ఈ మొత్తం కలిపితే మొత్తం 25 స్థానాలు.

    ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు బ్రదర్స్ ఎన్నికల బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి నైతికంగా మద్దతు ఇస్తున్న ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు... జనసేనలో చేరి... నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దిగారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో... జనసేన వ్యూహాత్మకంగానే నాగబాబును ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. ఎందుకంటే భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీకి దిగారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రభావం ఉంటుందన్నది జనసేన అంచనా వేస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జనసేనకు కలిసొస్తుందని... నాగబాబు బరిలో ఉంటే నరసాపురం లోక్‌సభ సీటును కూడా గెలవచ్చనే ప్లాన్‌తోనే ఆ పార్టీ అక్కడ నాగబాబును బరిలోకి దింపింది. అయితే పవన్ కల్యాణ్ గెలుపుతో పాటు... నరసాపురం ఎంపీగా నాగబాబు విజయం కూడా తథ్యం అని అనేక సర్వేలు తేల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా చెప్పిన సర్వే వివరాలు జనసేనకు లేనిపోని అనుమానాలు తెచ్చిపెడుతున్నాయి.

    ఢిల్లీలో ఉన్న సీఎం పార్టీ నేతలకు చంద్రబాబు తాను చేయించిన సర్వేలో ఏయే పార్టీలకు ఎన్నెన్ని ఓట్లు వస్తాయో వివరించారు. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలు ఉండగా టీడీపీకి 17 స్థానాలు, వైసీపీకి 8 స్థానాలు దక్కుతాయని ఉంది. అయితే ఈ మొత్తం కలిపితే మొత్తం 25 స్థానాలు. అంటే మరే పార్టీ గెలిచేది లేదని తేల్చేశారు. దీన్ని చూపించి... ఈసారి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందనీ, కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతోందని చెబుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు లెక్క బాగానే ఉన్నా... మరి జనసేన పరిస్థితి ఏంటని ఆ పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఆలోచనలో పడిపోయారు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన నాగబాబు గెలిచే పరిస్థితి లేదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

    అయితే చంద్రబాబు సర్వే లెక్కలు ఉన్నా... నరసాపురంలో మాత్రం నాగబాబు గెలుపునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే... చాలావరకు అక్కడున్న మహిళలు జనసేనకు ఓటేసినట్లు ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో తేలింది. ఎన్నికల పోలింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన నాగబాబు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఫలితం ఎలా వస్తుందో తెలియదు అన్న నాగబాబు...అది తనకు అనవసరం అన్నారు. అయితే పాజిటివ్ రిజల్ట్‌ని ఊహిస్తున్నా అన్నారు. ఏది ఏమైనా ఎన్నికల సందర్భంగా ప్రజలు నాపై చూపిన ప్రేమకు నా జీవితాన్ని వాళ్లకు అంకితం చేశాయాలని అనిపించిందన్నారు నాగబాబు. నరసాపురం ఏరియాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరి నాగబాబు గెలుపోటములు తేలాలంటే మాత్రం.. మరో మూడు రోజులు ఆగాల్సిందే.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena, Janasena party, Nagababu, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు