మండలి రద్దుపై... యనమల, లోకేష్ చిట్ చాట్

మండలి రద్దు చేస్తారంటే టీడీపీ సభ్యులు ఎవరూ ఈ విషయంలో భయ పడటం లేదన్నారు నారా లోకేష్. మండలి రద్దు జరిగితే వైసీపీలోనే చీలిక వస్తుందన్నారు.

news18-telugu
Updated: January 21, 2020, 2:43 PM IST
మండలి రద్దుపై... యనమల, లోకేష్ చిట్ చాట్
నారా లోకేష్ (File)
  • Share this:
శాసనమండలిని జగన్ ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ వస్తున్న వ్యాఖ్యలపై అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రులు యనమల, నారా లోకేష్ చిట్ చాట్ చేశారు. మండలి రద్దు అనేది అంత సులభమైన ప్రక్రియ కాదన్నారు. పార్లమెంట్ నిర్ణయంతో మండలి రద్దు సాధ్యం అవుతున్నందాన్నారు. శాసన మండలిని రద్దు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుందన్నారు యనమల. మండలి రద్దు చేస్తారంటే టీడీపీ సభ్యులు ఎవరూ ఈ విషయంలో భయ పడటం లేదన్నారు నారా లోకేష్. మండలి రద్దు జరిగితే వైసీపీలోనే చీలిక వస్తుందన్నారు. మండలి రద్దు వార్తలపై మీడియతో నారా లోకేష్, యనమల చిట్ చాట్ నిర్వహించారు.

మరోవైపు జగన్ సర్కార్ మాత్రం మండలి రద్దుపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మండలిలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో... బిల్లు ఆమోదం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందని పరిస్థితులు నెలకొంటే... శాసనమండలినే రద్దు చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలనే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్టు సమాచారం. మండలిని రద్దు చేయడం వల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకోవడం వైసీపీ ముఖ్యనేతలు, సీఎం జగన్‌తో చర్చిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు