ఏపీ మంత్రులకు నారా లోకేశ్ శుభాకాంక్షలు... ఎవరికో తెలుసా...

గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభకు వచ్చిన నారా లోకేశ్... తనకు తారసపడ్డ పలువురు వైసీపీ నేతలతో కరాచలనం చేశారు.

news18-telugu
Updated: June 14, 2019, 11:52 AM IST
ఏపీ మంత్రులకు నారా లోకేశ్ శుభాకాంక్షలు... ఎవరికో తెలుసా...
నారా లోకేశ్(File)
  • Share this:
గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఏపీలోని శాసనసభ, శాసనమండలి సభ్యులు ఒకేచోటకి రావడంతో పలు ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్‌ గవర్నర్ ప్రసంగం వినేందుకు అసెంబ్లీకి వచ్చారు. శాసనమండలిలో సభ్యుడైన లోకేశ్ మండలికి రావడంతో అందరి దృష్టి ఆయనపై నెలకొంది. శాసనసభకు వచ్చిన లోకేశ్... తనకు తారసపడ్డ పలువురు వైసీపీ నేతలతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి ఆదిమూలుపు సురేశ్‌లతో కరచాలనం చేసిన లోకేశ్... వారికి శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఎదురుపడ్డ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు నమస్కారం చేసి ముందుకు సాగారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో టీడీపీ నేత, సినీనటుడు బాలకృష్ణ కూడా అసెంబ్లీ లాబీల్లో పలువురు వైసీపీ నేతలతో కరచాలనం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా లోకేశ్ కూడా వైసీపీ నేతలకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేశ్... శాసనమండలిలో సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.


First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...