Home /News /politics /

NARA LOKESH WISHES TO CHANDRABABU ON HIS WEDDING ANNIVERSARY SB

ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు... నారా లోకేష్ ట్వీట్ ఏంటో తెలుసా ?

సతీమణి భువనేశ్వరితో చంద్రబాబు

సతీమణి భువనేశ్వరితో చంద్రబాబు

తల్లిదండ్రులిద్దరూ దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు నారా లోకేష్.

    ఇవాళ టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఆయనకు, తనయుడు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో విషెస్ తెలుపుతూ లోకేష్ ట్వీట్ చేశారు. ‘ ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు.’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. తల్లిదండ్రులిద్దరూ దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.  మరోవైపు పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున చంద్రబాబు, భువనేశ్వరిలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Nara Bhuvaneshwari, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు