నారా లోకేశ్‌కు వరంగా సీఎం జగన్ నిర్ణయం...

గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతం విస్తరించి ఉన్న మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్... వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

news18-telugu
Updated: December 23, 2019, 7:26 PM IST
నారా లోకేశ్‌కు వరంగా సీఎం జగన్ నిర్ణయం...
నారా లోకేష్, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్‌కు వరంగా మారనుందా ? వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నారా లోకేశ్‌కు కలిసొస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతం విస్తరించి ఉన్న మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్... వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని... టీడీపీ బలహీనంగా ఉన్న స్థానంలో పార్టీని గెలిపిస్తానని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు.

అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరు ఉండటంతో... వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు కోసం లోకేశ్ కష్టపడాల్సి ఉంటుందని చాలామంది భావించారు. అయితే ఏపీ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించాలని సీఎం జగన్ చేసిన ప్రకటనతో రాజధాని ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసన సెగలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా తగులుతున్నాయి. ఆయన కనిపించడం లేదంటూ కొందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాజధాని ప్రాంతం ఉన్న మరో నియోజకవర్గం తాటికొండకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కూడా ఈ నిర్ణయం ఇబ్బంది కలిగించే పరిణామమే అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మున్ముందు సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో తెలియడంలేదు.

మరోవైపు రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల ముందు రాజధానిని మార్చబోము అని మేనిఫెస్టోలో ప్రకటించడం వల్లే ఈ రెండు చోట్ల వైసీపీ గెలిచిందని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం... చంద్రబాబు మానసపుత్రిక అవరావతికి ఇబ్బందే అయినా... లోకేశ్‌కు మాత్రం ఇది కలిసొచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: December 23, 2019, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading