Home /News /politics /

NARA LOKESH WARNING TO CM JAGAN OVER ATCHANNAIDU DISCHARGE FROM GGH SK

జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. నారా లోకేష్ వార్నింగ్

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని.. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. గాయం మానక ముందే డాక్టర్లపై ఒత్తిడి చేసి బలవంతంగా డిశ్చార్జి చేశారని మండిపడ్డారు లోకేష్.

    ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంపై దుమారం రేగుతోంది. ప్రభుత్వ నుంచి ఒత్తిడి వల్లే ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడనప్పటికీ ఆస్పత్రి నుంచి ఎందుకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు డిశ్చార్జిపై ట్విటర్ వేదికగా స్పందించారు నారా లోకేష్. సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని.. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. గాయం మానక ముందే డాక్టర్లపై ఒత్తిడిచేసి అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జి చేశారని మండిపడ్డారు లోకేష్.

    అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్లపై తిప్పి రెండోసారి ఆపరేషన్‌కి కారణం అయ్యారు. ఇప్పుడు గాయం మానక ముందే డాక్టర్ల పై ఒత్తిడి చేసి డిశ్చార్జ్ చేసారు. చేస్తున్న ప్రతీ తప్పుకి జగన్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోక తప్పదు.
    నారా లోకేష్



    మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలసిందే. ఆయన ఆరోగ్య మెరుగుపడిందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు డాక్టర్లు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను నేరుగా సబ్‌జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో జైలుకు తీసుకెళ్లారు. ఐతే కోవిడ్ టెస్ట్ చేశాక, రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కానీ అదేమీ పట్టించుకోకుండా సబ్ జైలుకు తరలించారు అధికారులు.

    ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు సొంత ఇంటిలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే అచ్చెన్నాయుడుకు అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోనే ఆయన్ను విచారించింది ఏసీబీ. ఇక ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి కావడంతో సబ్ జైలుకు తరలించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Kinjarapu Atchannaidu, Nara Lokesh, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు