జగన్‌ పాలనపై హరీష్ రావు కామెంట్స్... నారా లోకేష్ ట్వీట్

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఏపీ రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జత చేశారు.

news18-telugu
Updated: December 31, 2019, 7:50 AM IST
జగన్‌ పాలనపై హరీష్ రావు కామెంట్స్... నారా లోకేష్ ట్వీట్
నారా లోకేష్, వైఎస్ జగన్
  • Share this:
సీఎం జగన్ పాలనపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. వైఎస్ జగన్ గారి అద్భుత పాలన పాటవాల గురించి పక్క రాష్ట్రాల మంత్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూడండంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఏపీ రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జత చేశారు. ఇటీవలే ఏపీ రాజకీయాలపై స్పందించిన హరీష్ రావు... అమరావతిలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితులుతో తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. అమరావతిపై నెలకొన్న సందిగ్ధతతో స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా మందగించింది . ఈ ప్రభావంతో హైదరాబాద్ లో మరొకసారి స్థిరాస్తి వ్యాపారం పుంజుకునే అవకాశాలున్నాయని హరీష్ రావు విశ్లేషించారు. ఏపీ లో నెలకొన్న పరిస్థితుల నేపధ్యం లో ఐటీ ఉద్యోగులు , బ్యూరోక్రాట్లు , వ్యాపారవేత్తలు ఇలా పలు రంగాలకు చెందినవారు హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తితో ఉన్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు .దేశంలోని ఇతర పట్టణాలతో పోలిస్తే హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారానికి అనువైన ప్రాంతమని అన్నారు .



First published: December 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు