‘ఏపీలో త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా పెరుగుతాయి’

డీజిల్ పై వ్యాట్‌ను 22.25 శాతంను 27 శాతంకు పెరిగింది. దీని ప్రకారం లీటర్ రూ.2 పెరగనుంది. పెట్రోల్ ధర ప్రస్తుతం లీటర్‌కు రూ.78వరకు ఉంది. డీజిల్ ధర రూ.71.89 గా ఉంది.

news18-telugu
Updated: January 30, 2020, 4:03 PM IST
‘ఏపీలో త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా పెరుగుతాయి’
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ధరలపై నారా లోకేష్ విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వం బాదుడు బాదుతుందని ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు పెంచుకుంటూ పోతా అని వైఎస్ జగన్ గారు అంటే సంక్షేమ కార్యక్రమాలు అనుకున్నా.... ఆయన అన్నది ప్రజల పై భారం పెంచడం అని తనకు అర్థమైందన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేసారు, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచేసారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక రేపో మాపో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దీనిపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మరో ట్వీట్ కూడా చేశారు. ‘రేపో, మాపో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధం అవుతుంది వైకాపా ప్రభుత్వం. పేదల రక్తాన్ని జలగలా సైలెంట్ గా లాగేస్తున్నారు జగన్ గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పై పెట్రో బాంబు వెయ్యడం దారుణం. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి.’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా చమురు ధరల పరిణామాల పేరుతో చమురు సంస్థలు ప్రతి రోజు పైసల్లో ధరల్ని పెంచుతూ, స్వల్పంగా తగ్గిస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తూ పెట్రోలు డీజిలు ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు గత ప్రభుత్వం అనూహ్యంగా వైసీపీ ప్రభుత్వం లీటరుకు రెండు రూపాయాలు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్ టాక్స్‌ను ఒకే సారి 4.5 శాతం పెంచుతూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డి. సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. పెట్రోల్ పై వ్యాట్ 31 శాతం ఉండగా... దీనిని 35.20కు పెంచారు. డీజిల్ పై వ్యాట్‌ను 22.25 శాతంను 27 శాతంకు పెరిగింది. దీని ప్రకారం లీటర్ రూ.2 పెరగనుంది. పెట్రోల్ ధర ప్రస్తుతం లీటర్‌కు రూ.78వరకు ఉంది. డీజిల్ ధర రూ.71.89 గా ఉంది. జిల్లాల్లో పెట్రోల్ నిత్యం 9.5 లక్షల లీటర్ల మేరకు వినియోగిస్తుండగా.. డీజిల్‌ను ఏకంగా 35 లక్షల లీటర్లు వినియోగిస్తున్నారు.

First published: January 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు