ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేడర్ మీద దాడులు చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఓ వైపు రాష్ట్రంలో ఆత్మకూరు వివాదం రాజకీయంగా వేడి రాజేస్తున్న సమయంలో నారా లోకేష్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘ఈ రాక్షస రాజ్యంలో వైకాపా గూండాల అరాచకత్వానికి ఇంకెంతమంది నెత్తురు చిందించాలి? జగ్గయ్యపేట పట్టణంలో తెదేపా మైనారిటీ కార్యకర్త షేక్ సలీంపై కత్తులతో దాడిచేశారు. ఇవేనా మీ పాలనలో ప్రశాంతంగా ఉన్న శాంతిభద్రతలు హోమ్ మంత్రిగారు? లేక ఇతన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టు అని అంటారా?’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. దీంతోపాటు ‘శభాష్ వైఎస్ జగన్ గారూ !! మీ పాలన అద్భుతం. ఎంత అద్భుతంగా ఉందంటే, పేదవాడికి పట్టెడు అన్నం దొరక్కపోయినా, మీ వైకాపా గూండాల దాహానికి మా కార్యకర్తల రక్తం, ఆకలైతే నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయి. ముగిసిందనుకున్న ఫ్యాక్షన్ భూతాన్ని రాష్ట్రం మీద వదిలారు.’ అని మరో ట్వీట్ చేశారు.
శభాష్ @ysjagan గారూ !! మీ పాలన అద్భుతం. ఎంత అద్భుతంగా ఉందంటే, పేదవాడికి పట్టెడు అన్నం దొరక్కపోయినా, మీ వైకాపా గూండాల దాహానికి మా కార్యకర్తల రక్తం, ఆకలైతే నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయి. ముగిసిందనుకున్న ఫ్యాక్షన్ భూతాన్ని రాష్ట్రం మీద వదిలారు.
అయితే, ఇది ఎక్కడ జరిగింది? బాధితుడు ఎవరు? దాడి చేసిన వారు ఎవరనే అంశాన్ని నారా లోకేష్ వెల్లడించలేదు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.