Home /News /politics /

NARA LOKESH TWEETS ON WORLD BANK DROPPED FROM AMARAVATI PROJECTS SAYS JAGAN DREAM COME TRUE BA

జగన్ కల నెరవేరిందంటున్న నారా లోకేశ్

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

Nara Lokesh | ‘జగనన్న వచ్చారు, వరల్డ్ బ్యాంక్ పోయింది. జగన్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేసారు.’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల నెరవేరిందని మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. అమరావతిలో పెట్టుబడులను ప్రపంచబ్యాంక్ ఉపసంహరించుకుంది. 300 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వాలనుకుని.. ఆ తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం డోలాయమానంలో పడింది. దీనిపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘జగనన్న వచ్చారు, వరల్డ్ బ్యాంక్ పోయింది. జగన్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేసారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది. బాబుగారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయ్యింది. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే కార్యాచరణలో జగన్ మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో ! ఇంత జరిగిన తరువాత కూడా మంత్రి బుగ్గన గారు 2006 లొనే వైఎస్ అధిక వడ్డీకి మీరు ఆంధ్రాకి లోన్ ఇవ్వొద్దు అంటూ వరల్డ్ బ్యాంక్ కి లేఖ రాసారు అందుకే ఆయన పై ఉన్న గౌరవంతో వెనక్కి వెళ్లారు అని లేఖ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు.’ అని ట్వీట్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు