బాలయ్య మామా ... రూలర్ సినిమా దుమ్ము లేపిద్దంటున్న నారా లోకేష్

పిల్లనిచ్చిన బాలయ్యపై నారా లోకేష్ మాస్‌ డైలాగ్స్‌తో పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: December 8, 2019, 11:40 AM IST
బాలయ్య మామా ... రూలర్ సినిమా దుమ్ము లేపిద్దంటున్న నారా లోకేష్
బాలకృష్ణ, నారా లోకేష్
  • Share this:
టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం బాలకృష్ణ తాజాగా ‘రూలర్’ సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దానికి బాలయ్య అభిమానుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య లుక్ అదిరిందంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా హిట్ గ్యారంటీ అంటూ జోస్యం చెబుతున్నారు. అయితే తాజాగా బాలయ్య అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా రూలర్ సినిమాపై స్పందించారు. ట్రైలర్‌లో బాలయ్య డైలాగులు చెబుతూ ట్వీట్ పెట్టారు. ‘బాలా మావయ్యా!మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా 'రూలర్' ట్రైలర్ అదుర్స్.దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా’ అంటూ ట్వీట్ చేశారు. పిల్లనిచ్చిన బాలయ్యపై నారా లోకేష్ మాస్‌ డైలాగ్స్‌తో పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్‌తో కలిసి ఈయన మరోసారి వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్.. టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో వచ్చాడు నందమూరి హీరో. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్. ముఖ్యంగా ఆయన గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి కిరాక్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు టీజర్‌లో కూడా ఈ గెటప్ హైలైట్ అయింది. మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు బాలయ్య బాబు.


Published by: Sulthana Begum Shaik
First published: December 8, 2019, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading