ఒక్కో ఉద్యోగం 5లక్షలకు అమ్ముకున్నారు... నారా లోకేష్ ట్వీట్

నారా లోకేష్ గ్రామ సచివాలయ పరీక్షా పేపర్ లీకులపై మండిపడ్డారు. ‘ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారంటూ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: September 22, 2019, 2:54 PM IST
ఒక్కో ఉద్యోగం 5లక్షలకు అమ్ముకున్నారు... నారా లోకేష్ ట్వీట్
నారా లోకేష్ (File)
  • Share this:
గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై టీడీపీ అధికార పార్టీపై విమర్శలు ఆపడం లేదు.  ఓ వైపు జగన్ ప్రభుత్వం అర్హత సాధించిన వారికి పోస్టులు కేటాయించే పనిలో పడుతుంటే.. మరోవైపు టీడీపీ మాత్రం  ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఏపీ మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గ్రామ సచివాలయ పరీక్షా పేపర్ లీకులపై మండిపడ్డారు. ‘ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం.పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.

‘మరి మీరు రాజీనామా చేస్తున్నారా లేదా? మేము కొత్తగా ఏమి అడగడం లేదు, అప్పట్లో మీరు అడిగిన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాం’ అంటూ మరో ట్వీట్ చేశారు. అయ్యా... అంటూ వైఎస్ జగన్‌ గారూ అంటూ మరో ట్వీట్ చేశారు లోకేష్. ‘జరగని పేపర్ లీకేజి మీద నానా రభసచేశారు అప్పట్లో గుర్తుందా? జరిగిన విచారణలో కూడా అదే తేలింది అప్పట్లో. కానీ మీరేం అన్నారో, మీ అబద్ధపు పత్రిక ఎలా విషం చిమ్మిందో ఒకసారి మళ్ళీచూసుకోండి. అప్పట్లో రాజీనామా చెయ్యాలి, సిబిఐ విచారణ చెయ్యాలి అన్నారు. ఇప్పుడు ఏమి చేద్దాం?’ అంటూ ప్రశ్నించారు.
గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం.పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు#YSJaganFailedCM #YCPPaperLeakScam pic.twitter.com/d2awzTO5qu
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading