Home /News /politics /

NARA LOKESH TWEETS ON AP CM JAGAN MOHAN REDDY CANCEL CHRISTMAS GIFT SB

క్రిస్మస్ కానుక ఎత్తేసిన జగన్.... నారా లోకేష్ ట్వీట్

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

ఉన్న దాంట్లోనే క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకల్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాన్నారు నారా లోకేష్.

    మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ట్టిట్టర్ వేదికగా  విమర్శల దాడి చేశారు.. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం ఉన్న సంక్షేమ కార్యక్రమాల్ని ఎత్తేస్తోందని ఆరోపించారు. ఉన్న దాంట్లోనే క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకల్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాన్నారు. ఆ ప్రభువు కృప మీపై ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు లోకేష్. తన తండ్రి చంద్రబాబు నాయుడు పరిపాలనతో ప్రస్తుతం ఏపీలో జగన్ పరిపాలనను పోల్చుతూ మరో ట్వీట్ చేశారు. ‘ఇద్దరూ ముఖ్యమంత్రులే, తనతోపాటు పేదక్రిస్టియన్ సోదరులంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ప్రతీఏడాది క్రిస్మస్ కానుక ఇచ్చినవ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తాను మాత్రమే సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలి పేద క్రిస్టియన్ సోదరులు ఏమైతే నాకేంటి అనుకొని క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ’ అంటూ మరో ట్వీట్ చేశారు లోకేష్.



    క్రిస్మస్ సందర్భంగా గుంటూరులోని సెయింట్ మ్యాథీవ్స్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపించిన మార్గంలో అందరూ నడవాలన్నారు. మన కుటుంబంతో పాటు సమాజం అంతా సంతోషంగా ఉండాలి అని ప్రార్థన చేయాలన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే శక్తిని ఏసు మనకిచ్చారన్నారు.  క్రిస్మస్ సందర్భంగా పేద వారికి తోచిన విధంగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. క్రీస్తు సందేశమే ప్రపంచ శాంతి కి మార్గమన్నారు లోకేష్. క్రైస్తవులు అందరూ ఆనందంగా క్రిస్మస్ వేడుకలుజరుపుకోవాలన్నారు.







    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Ap cm jagan, Christmas Day, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు