ఇదే నిజం.. అమరావతిలో ఉద్రిక్తతపై నారా లోకేష్ ట్వీట్

ఇతర ప్రాంతాల నుంచి గూండాలను రప్పించి చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు నారా లోకేష్.

news18-telugu
Updated: November 28, 2019, 5:04 PM IST
ఇదే నిజం.. అమరావతిలో ఉద్రిక్తతపై నారా లోకేష్ ట్వీట్
నారా లోకేష్ (File)
  • Share this:
చంద్రబాబు అమరావతి పర్యటనపై ఏపీలో దుమారం రేగుతోంది. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ కొందరు వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైటెన్షన్ మధ్యే చంద్రబాబు అమరావతిలో పర్యటించి రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. ఐతే చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వారు రైతులు కాదని.. పెయిడ్ బ్యాచ్‌తో వైసీపీ నేతలే ఈ దాడులు చేయించారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనపై నారా లోకేష్ స్పందించారు.

అసలైన అమరావతి ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారని ట్విటర్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం పెయిడ్ బ్యాచ్‌తో దాడులు చేయించి దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇతర ప్రాంతాల నుంచి గూండాలను రప్పించి చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు నారా లోకేష్.
First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>