NARA LOKESH TOUR IN VISAKHAPARNAM DISTRIC NARSIPATNAM POLICE STOPS TDP BIKE RALLY SB
విశాఖ జిల్లాలో నారా లోకేష్‌కు షాక్... ర్యాలీకి నో పర్మిషన్
విశాఖలో నారా లోకేష్ పర్యటన
ఇప్పుడు జగన్ పెట్టిన ఆంక్షలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుంటే ఆయన పాదయాత్ర చేసి ఉండేవాడు కాదన్నారు. ఎక్కడ జగన్ పాదయాత్రకి ఇబ్బందులు పెట్టకుండా సాఫీగా జరిగినట్లు చేసిన ఘనత మాదే అన్నారు.
విశాఖ జిల్లాలో మాజీ మంత్రి , టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నర్సీపట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు వారి ర్యాలీని అడ్డుకున్నారు. హెల్మెట్లు పెట్టుకున్నాకే టూ వీలర్ ర్యాలీ నిర్వహించాలని పోలీసులు తెలిపారు. దీనిపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు జగన్ పెట్టిన ఆంక్షలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుంటే ఆయన పాదయాత్ర చేసి ఉండేవాడు కాదన్నారు. ఎక్కడ జగన్ పాదయాత్రకి ఇబ్బందులు పెట్టకుండా సాఫీగా జరిగినట్లు చేసిన ఘనత మాదే అన్నారు.
ర్యాలీకి బైక్ వాహనదారులు హెల్మెట్లు పెట్టుకోవాలా అంటూ మండిపడ్డారు లోకేష్. మా ఫ్లెక్సీలకు అనుమతి ఇవ్వరా? అంటూ ఏపీ సర్కార్‌ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో నిరంకుశ ప్రభుత్వ పాలన నడుస్తోందని విమర్శించారు. గతంలో మేము ఇలా చేసి ఉంటే జగన్ ప్రజలకు కలిసే అవకాశం లేకుండా ఉండేదన్నారు. ఏ సమయంలోనైనా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు ఇలాంటి ఆంక్షలు సరైన పద్ధతి కాదన్నారు. పోలీసులతో ర్యాలీని అడ్డుకోలేరన్నారు. తెలుగుదేశానికే కార్యకర్తలే బలమన్న లోకేష్.. తిరిగి పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఏపీ ప్రభుత్వం అభద్రతా భావం కారణంగానే తన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు విశాఖలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం చేరుకున్న నారా లోకేశ్ పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.