మళ్లీ నోరుజారిన నారా లోకేష్... ఎన్నికల కోడ్‌పై స్పందిస్తూ...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో ముగిసిపోయాయి. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరిగినవి లోక్‌సభ ఎన్నికలు మాత్రమే.

news18-telugu
Updated: April 21, 2019, 5:19 PM IST
మళ్లీ నోరుజారిన నారా లోకేష్... ఎన్నికల కోడ్‌పై స్పందిస్తూ...
నారా లోకేష్
news18-telugu
Updated: April 21, 2019, 5:19 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మరోసారి తడబడ్డారు. అయతే ఈసారి ట్వీట్ చేస్తూ... కన్‌ఫ్యూజ్ అయ్యారు. చంద్రబాబు సీఎం హోదాలతో అధికారులతో సమీక్ష జరుపుతుంటే... ఈసీ సీరియస్ అవ్వడంపై లోకేష్ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షలు సమావేశాలు పెట్టుకుంటుంటే స్పందించలేదంటూ ఆరోపించారు. తెలంగాణలో వర్తించని కోడ్ ఏపీలో ఎందుకు వర్తిస్తుందని ? ఏంటి పక్షపాతమని ట్వీట్ చేశారు లోకేష్. ఇక్కడే లోకేష్ బాబు మరోసారి పప్పులో కాలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

ఏపీలో ఉండే ఎన్నికల కోడ్‌కు, తెలంగాణ కోడ్‌కు తేడా తెలియదా అంటూ లోకేష్‌ను ఆడేసుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో ముగిసిపోయాయి. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరిగినవి లోక్‌సభ ఎన్నికలు మాత్రమే. తెలంగాణలో కేసీఆర్ ఫుల్ టైమ్ సీం. తెలంగాణలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ...లోక్‌సభ ఫలితాల తర్వాత ప్రభుత్వం మారదు కాబట్టి అవన్నీ అక్కడ చెల్లుబాటు అవుతాయి. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం వేరు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రెండుూ జరగడంతో ఫలితాలు వచ్చే వరకు ఏపీ సీఎంకు నామామాత్రపు అధికారాలే ఉంటాయి. కోడ్ విషయంలో ఏపీ తెలంగాణకు చాలా తేడా ఉంది.

దీంతో లోకేష్ పెట్టిన ఎన్నికల కోడ్‌కు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిన్న లాజిక్ కూడా తెలియదా లోకేష్ అంటూ నెటిజన్లు. అటు ప్రతిపక్ష పార్టీల అభిమానులు చినబాబును ఆడేసుకుంటున్నారు. మొత్తం మీద మరోసారి లోకేష్ నోరుజారి పప్పులో కాలేసినట్లు అయిపోయింది.First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...