ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోలవరంలో తగ్గించామని చెప్పి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని తుగ్లక్ అని విమర్శించిన నారా లోకేష్.. రివర్స్ టెండరింగ్‌తో పోలవరంపై చైనా మేఘాలు కమ్ముకున్నాయన్నారు. ‘అయ్యా తుగ్లక్ ముఖ్యమంత్రిగారూ... ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కట్టు కట్టించినట్టుంది మీ తెలివి. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని సామాన్యప్రజలకూ అర్థమైంది. పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎటువంటి అనుభవంలేని కంపెనీకి అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం. రివర్స్ టెండరింగ్ లో భాగంగా ప్రాజెక్టుపైకి చైనా ``మేఘా``లు కమ్ముకొస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేటుకడ్డంగా బోటు పడితే తీయడానికి మీకు వారం పట్టింది.గోదావరిలో మునిగిన బోటును రెండువారాలుగా తీయలేక, 144 సెక్షన్ పెట్టారు. 70 శాతం అయిన పోలవరం 30 శాతం పూర్తి చేస్తామని సవాల్ విసురుతున్న మంత్రిగారికి అలవాటైన విద్యేమో?.. పోలవరంపైనా బెట్టింగ్ కాద్దామంటున్నారు.’ అని విమర్శించారు.
అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రిగారూ.. ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కట్టు కట్టించినట్టుంది మీ తెలివి. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని సామాన్య ప్రజలకూ అర్థమైంది.#YSJaganFailedCM
— Lokesh Nara (@naralokesh) September 25, 2019
రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా పోలవరంలో కొన్ని పనులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లను ఓపెన్ చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో రూ.274 కోట్లు ఇచ్చిన పనులకు మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెనీ రూ.231.47 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.58 కోట్లు ఆదా అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh, Polavaram