చంద్రబాబును చెంపపై కొట్టిన నారా లోకేష్... వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు...

చంద్రబాబు నాయుడును నారా లోకేష్ చెంప మీద కొట్టారంటూ వైసీపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: April 19, 2020, 4:27 PM IST
చంద్రబాబును చెంపపై కొట్టిన నారా లోకేష్... వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు...
నారా లోకేష్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, ఈ క్రమంలో పెద్దాయన చెంప కూడా చెళ్లుమందని చెప్పారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ కదలదు. చిన్నబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ బతకదు. ఇది ప్రధానమైన సమస్య. చంద్రముఖిగా మారిన చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్న. లాక్ డౌన్ లో ఉన్న చంద్రబాబును చూసి నాకు నిజంగా నవ్వాల్నో, ఏడవాల్నో అర్థంకావడం లేదు. అధికారం పొగొట్టుకున్నాడు. చిన్నబాబును ఓడగొట్టుకున్నాడు. పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిలంలాగా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు మండలి కాస్తా రద్దు కాబోతోంది. ఇప్పుడు కొడుకు పరిస్ధితి ఏంటి. అది పెద్ద సందిగ్దమైన ప్రశ్న. కుటుంబపరిస్ధితి ఎలా ఉందంటే... నా కుమారుడు పరిస్థితి ఏందని ఒకరడిగితే, నాభర్త పరిస్ధితి ఏందని ఇంకొకరడిగితే... ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక చంద్రబాబునాయుడు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నాడు. పప్పు పరిస్దితి ఇప్పుడుగాని చూస్తే ఎంఎల్ ఏ కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు. ఎమ్మెల్సీ పదవి పోతుంది.ఈ పరిస్ధితులలో అయ్యా కొడుకులిద్దరూ కూడా చాలా కుటంబసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ముదిరి పెద్దాయన చెంప చెళ్లుమన్నది. ఏంటనేది మీరు అర్ధం చేసుకుంటారనుకుంటా.’ అని విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి ఆలోచనే లేదు...తనను వణికిస్తున్న కుటుంబసమస్యలే ఆయనను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. అందుకే ఇవేమి బయటపడకుండా తాను బాగున్నానని చెప్పుకుని రోజూ పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని చెప్పారు.
First published: April 19, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading