వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. ఆ జీవో తెస్తామన్న నారా లోకేష్

పరిశ్రమలను జగన్ పో పో అంటుంటే.. తెలంగాణ వాళ్లు రారా అంటున్నారన్న విమర్శించారు లోకేష్. జగన్ ఢిల్లీ వెళ్లడం వల్ల ఫ్లైటు, కారు ఖర్చు తప్ప ఉపయోగం లేదని విరుచుకుపడ్డారు.

Updated: February 12, 2020, 9:10 PM IST
వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. ఆ జీవో తెస్తామన్న నారా లోకేష్
సబ్‌జైల్లో యువకులను పరామర్శించిన లోకేష్
  • Share this:
అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టైన యువకులను నందిగామ సబ్ జైలులో టీడీపీ నేత నారా లోకేష్ పరామర్శించారు. యువకుల అరెస్ట్‌కు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం జరిగిన ర్యాలీలో నారా లోకేష్ పాల్గొన్నారు. జై హింద్ అన్నందుకు బ్రిటిష్ వాళ్లు జైళ్లలో పెడితే.. ఇప్పుడు జై అమరావతి అన్నందుకు వైఎస్ జగన్ జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు లోకేష్.

తుగ్లక్ పాలన గురించి చదువుకున్నాం. ఇప్పుడు జగ్లక్ పాలన చూస్తున్నాం. కుల మతాలకు, ప్రాంతాలకు మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నాడు. శాంతియుతంగా జై అమరావతి అన్నందుకే కేసులు నమోదు చేస్తున్నారు. యువకులను అక్రమంగా జైల్లో పెట్టారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఒక్క జీవోతో కేసులన్నీ తొలగిస్తాం. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటా.
నారా లోకేష్
పరిశ్రమలను జగన్ పో పో అంటుంటే.. తెలంగాణ వాళ్లు రారా అంటున్నారన్న విమర్శించారు లోకేష్. జగన్ ఢిల్లీ వెళ్లడం వల్ల ఫ్లైటు, కారు ఖర్చు తప్ప ఉపయోగం లేదని విరుచుకుపడ్డారు.
First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు