సీఎం వైఎస్ జగన్‌కు 3 డిమాండ్లు పెట్టిన నారా లోకేష్
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలగా పరిగణించి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు లోకేష్.
news18-telugu
Updated: November 14, 2019, 6:29 PM IST

నారా లోకేష్ (File)
- News18 Telugu
- Last Updated: November 14, 2019, 6:29 PM IST
విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్షలో మాజీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం ఇసుక కొరతపై ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్‌ది చేతగాని ప్రభుత్వమని.. భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నా చీమ కుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు లోకేష్. నేనూ 'డౌన్ డౌన్ ముఖ్యమంత్రి' అంటున్నానని.. దమ్ముంటే నాపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి.
ఇక ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వానికి మూడు డిమాండ్లు పెడుతున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలగా పరిగణించి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేయాలని అన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు ఇవ్వాలని.. 5 నెలలకుగా గాను మొత్తం రూ.50 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త ఇసుక విధానాన్ని రద్దుచేసి.. గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానాన్ని అమలు చేయాలన్నారు లోకేష్.

Loading...