Andhra Pradesh: లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఇళ్లు కూల్చేస్తాడు అన్నారు. మరి ఇప్పుడెందుకు ఇళ్లు కూల్చేస్తున్నారు?

మంగళగిరిలో ఉద్రిక్తత

ఉదయం నుంచి మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాల పేరుతో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించి.. ఆ కూల్చి వేయడంతో వివాదం మొదలైంది. బాధితులకు విపక్షాలు మద్దతు ఇవ్వడంతో మంగళగిరలో టెన్షన్ వాతావరణం కనిపించింది.

 • Share this:
  గంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరిస్థితి టెన్షన్ టెన్షన్ మారింది. అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికారులు పొక్లెయిన్‌లతో కూల్చేశారు. అియితే అంతకుముందు బాధితులు ఆ కూల్చివేతను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని పక్కకు నెట్టి కట్టడాలను పడగొట్టారు. నిర్మాణాలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే అధికారులకు కూల్చివేతలకు ఒడి గట్టారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

  ఐదు పదేళ్లు కాదు.. తాము 40 ఏళ్లుగా ఇదే ప్రాంతంలోనే ఉంటున్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించకుండా కట్టడాలను ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నించారు. అయినా అధికారులు వారి వాదనను పట్టించుకోలేదు. దీంతో బాధితులకు అండగా టీడీపీ, వాపక్ష నేతలు అక్కడకు భారీగా చేరుకుని అధికారులను నిలదీశారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాకే ఖాళీ చేయించాలని.. అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అధికారులకు, బాధితుల తరపున వచ్చిన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

  ప్రాణాలనైనా ఇస్తాం తమ ఇళ్లను కాపాడుకుంటాం అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కనీసం కోర్టు తీర్పు వచ్చినంత వరకు అయినా ఆగాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు, పోలీసులు వినలేదు. వారితో బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో చాలాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

  ప్రభుత్వం, అధికారుల తీరుపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. లోకేష్ గెలిస్తే మంగళగిరి లో పేదల ఇళ్లు కూల్చేస్తాడు అని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు
  కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం వైసీపీ నేతలను ఊరికే వదిలేయదన్నారు.
  మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను
  దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరిగే వరకూ వారికి టీడీపీ అండగా పోరాడుతుంది లోకేష్ స్పష్టం చేశారు.
  Published by:Nagesh Paina
  First published: