Home /News /politics /

'జగన్ సాండ్, ల్యాండ్' తమిళనాడులో దొరికిపోయింది.. లోకేష్ విమర్శలు

'జగన్ సాండ్, ల్యాండ్' తమిళనాడులో దొరికిపోయింది.. లోకేష్ విమర్శలు

లోకేష్, జగన్

లోకేష్, జగన్

తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.4 కోట్ల నగదు, కొంత బంగారం లభించింది.

    ఏపీ రాజకీయాల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఆయన పేరుతో స్టిక్కర్ కలిగిన ఓ తమిళనాడులో పట్టుబడడం, అందులో రూ.4 కోట్ల నగదుతో పాటు బంగారం లభించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఐతే ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన స్టికర్‌ను జిరాక్స్ తీసి దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఐనప్పటికీ వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యేల దోపిదీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని విమర్శలు గుప్పించారు.

    ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా? వైఎస్ సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది.
    నారా లోకేష్


    ఆంధ్రప్రదేశ్ విద్యుత్, అటవీ - పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు తమిళనాడులో పట్టుబడిన విషయం తెలిసిందే. తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.4 కోట్ల నగదు, కొంత బంగారం లభించింది. వాటికి సంబంధించిన వివరాలను చెప్పకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. కారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు తమిళనాడు పోలీసులు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Ys jagan

    తదుపరి వార్తలు