బ్లూ ఫ్రాగ్‌తో నాకు సంబంధం లేదు.. సీఎం జగన్‌పై లోకేష్ నిప్పులు

నారా లోకేష్ (File)

బ్లూ ఫ్రాగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు లోకేష్.

 • Share this:
  ఏపీలో ఇసుక వెబ్‌సైట్‌ను బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హ్యాక్ చేసిందని.. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించిందన్న వార్తలు ప్రకంపలు రేపుతున్నాయి. ఇప్పటికే బ్లూ ఫ్రాగ్‌ ఆఫీసులో తనిఖీలు చేసిన సీఐడీ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఐతే ఆ సంస్థతో లోకేష్‌కు సంబంధాలున్నాయని ప్రచారం జరగడంతో.. ఈ వ్యవహారంపై స్వయంగా ఆయనే స్పందించారు. బ్లూ ఫ్రాగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు లోకేష్.

  చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ ప్రభుత్వం చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతోంది. విశాఖలో బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీపై సిఐడి దాడులు, లోకేష్‌కి అత్యంత సన్నిహితుడు కంపెనీ అంటూ అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. బ్లూ ఫ్రాగ్ కంపెనీకి నాకు సంబంధం ఉందని దొంగచాటు ప్రచారం కాదు. దమ్ముంటే నిరూపించండి. నాకు ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు అసత్య వార్తలు సృష్టించిన వారిపైనా,సోషల్ మీడియాలో ఒక కుట్ర ప్రకారం నా పై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం ,వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.
  లోకేష్


  కాగా, విశాఖలో ఉన్న బ్లూ ఫ్రాగ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. బ్లూ ఫ్రాగ్‌ సంస్థ‌కు చెందిన పలువురు వ్యక్తులు సైట్‌ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయి. దాంతో రంగంలోకి దిగిన సీఐడీ .. స్థానిక పోలీసులతో కలిసి ఆ సంస్థ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. సర్వర్‌ని హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత ఇసుకను బ్లాక్ చేశారు? ఎవరికి ఆర్థిక ప్రయోజనాలు అందాయి? ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అనే దానిపై ఆరా తీస్తోంది.
  First published: