ఏపీలో ఇసుక కొరతపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇసుక కొరతపై ఇప్పటికే నారా లోకేష్ ఒక రోజు దీక్ష చేశారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇసుక కొరతతో పని లేకపోవడంతో పలువురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఇసుక కొరత చుట్టూనే తిరుగుతున్నాయి. ఇసుక సరఫరా చేయలేని ప్రభుత్వం.. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యకు కారణమవుతోందంటూ మండిపడుతున్నాయి విపక్షాలు.
ఆకలి బాధతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... వైకాపా మంత్రులు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా? బాధ్యతలేదా? దీనికంతటికీ మీ తుగ్లక్ తీసుకున్న నిర్ణయాలు, మీ నేతల అక్రమ ఇసుకదందా కారణం కాదా? pic.twitter.com/RNFZUxh2hx
— Lokesh Nara (@naralokesh) October 31, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.