Home /News /politics /

సభలో నిద్రపోతున్న జగన్... ఫోటో షేర్ చేసిన నారా లోకేష్

సభలో నిద్రపోతున్న జగన్... ఫోటో షేర్ చేసిన నారా లోకేష్

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే..ఈ మనిషికి ఇలా ఎలా నిద్ర పడుతోంది? అని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం రెండు చారిత్రాత్మక బిల్లులను ప్రవేశ పెట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లును జగన్ సర్కార్ సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సభకు సీఎం జగన్‌తో పాటు... ఏపీ మంత్రులంతా హాజరయ్యారు. వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్, సీఆర్డీఏ బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశ పెట్టారు. అయితే ఈసంద్భంగా సభలో జగన్ నిద్రపోతున్న ఫోటోను నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఓ వైపు రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే.. మరోవైపు రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే..ఈ మనిషికి ఇలా ఎలా నిద్ర పడుతోంది? అని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జగన్ నిద్రపోతున్న ఫోటోను కూడా దాంతో పాటు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు లోకేష్.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: AP Assembly, Ap cm ys jagan mohan reddy, AP Politics, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు