Home /News /politics /

NARA LOKESH SENSATIONAL COMMENTS ON AP CM YS JAGAN MOHAN REDDY BA

సీఎం జగన్‌పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. ‘అందుకు ఉరి తియ్యాలా?’ అని ప్రశ్న

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. దీంతో ఆయనపై కేసు పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల మీద టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘గల్లీలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా... టీడీపీ రద్దు చేసిన బాక్సయిట్ తవ్వకాలని మళ్ళీ రద్దు చేయడం, టీడీపీ భూమిపూజ చేసిన టీసీఎల్ కి మళ్ళీ భూమిపూజ చేయడం, టీడీపీ తెచ్చిన కియా సంస్థ 15 ఏళ్ళ క్రితం మా తండ్రిగారి కృషి మూలంగానే వచ్చిందనడం, పోలవరం కట్టింది మా తండ్రే అనడం ... ఏమిటో ఇదంతా?. వైసీపీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు లెండి. జగన్ సొంతంగా ఏదైనా చేస్తే ఏంటీ తుగ్లక్ పనులు అని ప్రజలంటున్నారు. అందుకే టీడీపీ చేసిన మంచిపనులనే మళ్ళీ చేసి, లేదా మనమే చేశామని చెప్పుకుంటే బెటర్ కదా అనుకుంటున్నారు. ఎవరేం చేయగలరో ప్రజలకు తెలుసు కదా. మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడి మీద మీరు కేసు పెడితే... ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి జగన్ గారూ? ఉరి తియ్యాలా? మీకు, మీ నాయకులకు దమ్ముంటే టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతే కానీ చేతగాని దద్దమ్మల్లా కేసులు పెట్టి పారిపోకండి. ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేక మా నాయకుల ప్రెస్ మీట్ల పై కులమతాల పేరుతో కేసులు పెడతారా? ఇది కాదా తుగ్లక్ చర్య అంటే’అని నారా లోకేష్ ట్వీట్ల వర్షం కురిపించారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు