సతీమణితో సెల్ఫీ దిగి మురిసిపోయిన లోకేశ్..

news18-telugu
Updated: September 12, 2018, 9:22 PM IST
సతీమణితో సెల్ఫీ దిగి మురిసిపోయిన లోకేశ్..
సతీమణి బ్రాహ్మణితో లోకేశ్ సెల్ఫీ(Image: Twitter)
news18-telugu
Updated: September 12, 2018, 9:22 PM IST
పట్టిసీమ ప్రాజెక్టు వద్ద సతీమణి బ్రాహ్మణితో మంత్రి నారా లోకేశ్ సెల్ఫీలు దిగి మురిసిపోయారు. ఇంత అందమైన ప్రదేశాన్ని మరోసారి సందర్శించడం.. అదీ తన సతీమణితో కలిసి సందర్శించడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పట్టిసీమ వద్ద భార్య బ్రాహ్మణితో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

కాగా, అంతకుముందు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైన పోలవరం గ్యాలరీ వాక్‌లోనూ లోకేశ్ సహా ఆయన సతీమణి పాల్గొన్నారు. పోలవరం గ్యాలరీ వాక్‌లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. తన కుమారుడు దేవాన్ష్ సైతం ఉత్సాహంగా గ్యాలరీ వాక్‌లో పాల్గొన్నాడని చెప్పారు. ఇక పోలవరంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను లోకేశ్ కొట్టిపారేశారు. ప్రతిపక్షాల విమర్శల్లో పస లేదని అన్నారు.First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...