ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేస్తున్న మాజీ మంత్రి నారా లోకేష్ ఆ పరంపర కొనసాగిస్తున్నారు. నిన్న ఏపీ బడ్జెట్ మీద విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తాజాగా గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలకు సంబంధించి జగన్ మీద పంచ్‌లు వేశారు. ‘అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూసాం. జగన్ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఉత్తుత్తి ఇంటర్వ్యూలను చూసి యువతను ఇలా మోసం చేస్తున్నారేంటా అని బాధపడుతున్నాం. జగన్ గారూ! ఇందుకేనా మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. పోస్టులను వైసీపీ నేతలు పంచేసుకుని, అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నాక, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా? దీనికి స్వఛ్చంద దోపిడీ వ్యవస్థ అని పేరు పెట్టాల్సింది.’ అని ట్వీట్ చేశారు.
జగన్ గారూ! ఇందుకేనా మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. పోస్టులను వైసీపీ నేతలు పంచేసుకుని, అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నాక, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా? దీనికి స్వఛ్చంద దోపిడీ వ్యవస్థ అని పేరు పెట్టాల్సింది.
రేషన్ సరుకులు, పెన్షన్‌ను ఇంటింటికి చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సుమారు 7లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. గ్రామ వాలంటీర్లను స్థానిక ఎమ్మార్వో నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తుంది. అయితే, ఇంటర్వ్యూలు నామమాత్రంగానే జరుగుతున్నాయని, వైసీపీ నేతలు చెప్పిన వారినే వాలంటీర్లుగా నియమిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.