హోమ్ /వార్తలు /రాజకీయం /

వైఎస్ఆర్ డైలాగ్‌తో సీఎం జగన్‌పై నారా లోకేశ్ సెటైర్లు

వైఎస్ఆర్ డైలాగ్‌తో సీఎం జగన్‌పై నారా లోకేశ్ సెటైర్లు

నారా లోకేష్, వైఎస్ జగన్

నారా లోకేష్, వైఎస్ జగన్

పండుటాకుల పై జగన్ గారికి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదంటూ లోకేష్ మరో ట్వీట్‌లో విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా జగన్‌పై విమర్శలు కురిపించారు. వైఎస్ జగన్ గారి మొదట సంతకమే మాయ అన్నారు లోకేష్. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన ఆరోపణలు చేశారు. మాట మార్చి, మడమ తిప్పి పెన్షనర్లను మోసం చేశారన్నారు. జగన్ తండ్రి వైఎస్ఆర్ డైలాగ్స్‌లో ‘నేను విన్నాను, నేను ఉన్నాను అన్న పదాల్ని కూడా నారా లోకేష్ గుర్తు చేశారు. నేను విన్నాను నేను ఉన్నాను రూ. 3 వేల పెన్షన్ పక్కా అన్న జగన్ గారు నేను వినలేదు, నేను లేను అంటూ 250 రూపాయిలు పెంచి అవ్వా, తాతలను దగా చేసారన్నారు.రాజన్న రాజ్యంలో 60 ఏళ్లకే పెన్షన్ అని 8 నెలలు అయినా 60 ఏళ్లు దాటిన ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్నారన్నారు. పండుటాకుల పై జగన్ గారికి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదంటూ లోకేష్ మరో ట్వీట్‌లో విమర్శించారు. ఒకేసారి ఏడు లక్షల పెన్షన్లు ఎత్తేశారన్నారు. ఆఖరికి దివ్యాంగుల పెన్షన్ కూడా తీసివెయ్యడానికి మీకు మనస్సు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎత్తేసిన పెన్షన్లు తిరిగి ఇచ్చే వరకూ అవ్వా, తాతలు, దివ్యాంగుల తరపున మొండి ప్రభుత్వం పై టిడిపి పోరాడుతుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు నారా లోకేష్


First published:

Tags: Ap cm jagan, AP Politics, Nara Lokesh, Pension Scheme

ఉత్తమ కథలు