‘జగన్ గారు మద్యపాన నిషేధం అంటే ఏదో అనుకున్నాం.. ఇదా..’ నారా లోకేష్ సెటైర్

Nara Lokesh on YS Jagan | జగన్ మోహన్ రెడ్డి సర్కారీ వైన్ షాపులను ఏర్పాటు చేయడం ద్వారా గతంలో కంటే రూ.2,297 కోట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తామంటున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: July 29, 2019, 7:45 PM IST
‘జగన్ గారు మద్యపాన నిషేధం అంటే ఏదో అనుకున్నాం.. ఇదా..’ నారా లోకేష్ సెటైర్
లోకేష్, జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నెలకొల్పాలని నిర్ణయించారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు తగ్గిపోతాయని.. మెల్ల మెల్లగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేయొచ్చని భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు. అయితే, మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి సర్కారీ వైన్ షాపులను ఏర్పాటు చేయడం ద్వారా గతంలో కంటే రూ.2,297 కోట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తామంటున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘జగన్ గారు.. మద్యపాననిషేధం అమలుచేస్తారంటే ఏదో అనుకున్నాం. కానీ ప్రభుత్వ మద్యంషాపులు తెరుస్తారని, గతంకంటే ఆదాయం మరో రూ.2,297కోట్లు గడిస్తారని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బేవరేజెస్ కార్పొరేషన్ రిపోర్ట్ కి మీ పార్టీ కలర్ వేయిస్తారని అర్ధం చేసుకోలేకపోయాం. ఇది నిషేధమా లేక 'నిషా'దమ్మా?’ అని ట్వీట్ చేశారు.First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు