వైసీపీపై లోకేశ్ సెటైర్... వైఎస్ రాజారెడ్డి వల్లే స్వాతంత్ర్యం అంటూ...

నారా లోకేశ్(ఫైల్ పోటో)

Nara Lokesh | వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కియా మోటార్స్ పరిశ్రమ రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న చొరవే కారణమని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. “కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, వైఎస్ జగన్ గారి క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా ? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు” అంటూ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
    అంతకుముందు ఏపీలో కియా పరిశ్రమ రావడానికి చంద్రబాబు కంటే ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవ చూపించారన్న మంత్రి బుగ్గన... ఈ మేరకు కంపెనీకి చెందిన కీలక అధికారి రాసిన లేఖను అసెంబ్లీలో చదివి వినిపించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని... అసలు ప్రభుత్వం పనితీరుకు అది కొలమానం కాదని బుగ్గన విమర్శించారు.


    First published: