Home /News /politics /

NARA LOKESH SATIRES ON YS JAGAN AND VIJAYASAI REDDY AK

అవినీతిపై ఏ1,ఏ2 మాట్లాడటమా...వైసీపీపై లోకేశ్ విమర్శలు

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

Nara lokesh | నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా అక్రమాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై క‌మిటీ వేశారని... ఏ2 విజ‌య‌సాయిరెడ్డిగారు విచార‌ణ చేస్తార‌ట‌ అని నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు

    ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి ఏపీ సీఎం జగన్‌తో పాటు విజయసాయిరెడ్డిపై లోకేశ్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా అక్రమాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై క‌మిటీ వేశారని... ఏ2 విజ‌య‌సాయిరెడ్డిగారు విచార‌ణ చేస్తార‌ట‌ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క‌లికాలం కాక‌పోతే అక్రమాల విక్రమార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా అని వ్యాఖ్యానించారు. వైఎస్ గారి హ‌యాంలో సోలార్ విద్యుత్‌ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హ‌యాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారని లోకేశ్ అన్నారు.

    మీ నాయ‌న‌గారి నిర్వాకంతో డిస్కంల‌కు రూ. 8 వేల‌కోట్లు న‌ష్టం వ‌చ్చిందని... ఈ ఉదాహరణలు చాలవా, ఎవ‌రు మ‌హామేతో! ఎవ‌రు దార్శనికతో తెలుసుకోవడానికి అని ట్వీట్ చేశారు. అన్నయ్యలూ నాకేం తెలియ‌దంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా 2,636 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని తేల్చారని లోకేశ్ మండిపడ్డారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి జగన్ గారు అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుండి మిగులు విద్యుత్తు సాధించి 5ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

    Nara lokesh targets ysrcp, lokesh satires on ys jagan, nara lokesh comments on vijayasai reddy, nara lokesh twitter comments, జగన్‌పై నారా లోకేశ్ విమర్శలు, జగన్ విజయసాయిరెడ్డిపై లోకేశ్ విమర్శలు, నారా లోకేశ్ ట్విట్టర్ కామెంట్స్
    నారా లోకేశ్ లేటెస్ట్ ట్వీట్స్


    విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపామని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో రూ. 36 వేల కోట్ల పెట్టుబడి,13 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా ? అని వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత చంద్రబాబుగారి పై అవినీతి ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Nara Lokesh, Vijayasai reddy

    తదుపరి వార్తలు