ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్‌కు లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదని నారా లోకేశ్ ఆరోపించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయి అని ఐటీ శాఖ స్పష్టం చేసిందని టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. అయితే చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ. 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు శునకానందం పొందుతున్నారని విమర్శించారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్‌కు లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదని ఆరోపించారు. ఐటీ రైడ్స్‌లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్ధమైందని లోకేశ్ వ్యాఖ్యానించారు.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు @ysjagan గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్ధమైంది. (1/4) pic.twitter.com/FsaWqmsI3m
రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుందన్న జగన్‌ను వెంటాడుతోందని... అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్‌కి టిడిపికి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారని నారా లోకేశ్ అన్నారు. కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్‌కి టిడిపికి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్ స్పష్టం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా అలాంటి కోరికలు మాకు లేవని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.