వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో కరెంట్ కోతలు పెరిగిపోయాయని కొద్దిరోజులుగా టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ట్విట్టర్ వేదిక వైసీపీని, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్న మాజీమంత్రి నారా లోకేశ్... మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో కరెంట్ కోతలు పెరిగిపోయాయని కొద్దిరోజులుగా టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చరుచుకుంటున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. అయితే బయట ప్రజలు మాత్రం ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ ఫ్యాన్ గుర్తును బ్రతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు.
బయట చూస్తే ప్రజలంతా రావాలి కరెంట్, కావాలి కరెంట్ అని మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీ గుర్తునీ బతిమిలాడుకుంటున్నారు. మీరు కాస్త చీకట్లోంచి బయటకొచ్చి జనానికి కరెంటివ్వండి.
ఇప్పటికైనా జగన్ చీకటిలోంచి బయయకు వచ్చి ప్రజలకు కరెంట్ ఇవ్వాలని నారా లోకేశ్ సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరి లోకేశ్ ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ సెటైర్‌కు టీడీపీ ఏ రకంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.