మండలిలో హైడ్రామాపై నారా లోకేష్ సంచలన వీడియో..

బుధవారం మండలి లోపల నెలకొన్న పరిణామాల దృశ్యాలను నారా లోకేశ్ బయటపెట్టారు. మంత్రులు అనిల్, కొడాలి నాని, బొత్స, పేర్ని నాని సభలో రచ్చచేశారని ఆరోపించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Updated: January 23, 2020, 10:32 PM IST
మండలిలో హైడ్రామాపై నారా లోకేష్ సంచలన వీడియో..
శాసన మండలిలో దృశ్యాలు
  • Share this:
శాసనమండలిలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులపై ఛైర్మన్ షరీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని బుధవారం ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు, బాలకృష్ణ, రోజాతో పాటు ఇరు పార్టీల ఎమ్మెల్యేలు మండలి సమావేశాలను వీక్షించేందుకు గ్యాలరీకి వచ్చారు. టీడీపీ, వైసీపీ సభ్యుల నినాదాలు, ఆందోళన మధ్య బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ప్రకటన చేశారు షరీఫ్. ఆ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది వార్తలు వినిపించాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల వాగ్వాదం నెలకొందని.. ఛైర్మన్ షరీఫ్‌ పట్ల కొందరు సభ్యులు దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలిసింది. ఈ క్రమంలో సభ లోపల నెలకొన్న పరిణామాల దృశ్యాలను నారా లోకేశ్ బయటపెట్టారు. మంత్రులు అనిల్, కొడాలి నాని, బొత్స, పేర్ని నాని సభలో రచ్చచేశారని ఆరోపించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి:


First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు