Home /News /politics /

NARA LOKESH READY TO FILE NOMINATION IN MANGALAGIRI SB

తల్లిదండ్రుల ఆశీర్వచనాలతో... కాసేపట్లో నారా లోకేష్ నామినేషన్

నామినేషన్‌కు ముందు తల్లిదండ్రుల వద్ద లోకేష్ ఆశీర్వచనాలు

నామినేషన్‌కు ముందు తల్లిదండ్రుల వద్ద లోకేష్ ఆశీర్వచనాలు

భార్య బ్రాహ్మణీ కొబ్బరికాయతో దిష్టి తీసి నారా లోకేష్‌కు ఎదురు వచ్చారు. అనంతరం లోకేష్ నామినేషన్ వేసేందుకు బయల్దేరి వెళ్లారు.

    ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు బయల్దేరి వెళ్లే ముందు ఆయన తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు.. తల్లి భువనేశ్వరి కాళ్లకు మొక్కి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం భార్య బ్రాహ్మణీ కొబ్బరికాయతో దిష్టి తీసి నారా లోకేష్‌కు ఎదురు వచ్చారు. అనంతరం లోకేష్ నామినేషన్ వేసేందుకు బయల్దేరి వెళ్లారు. ఈసారి ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

    భార్య బ్రాహ్మణీ కొబ్బరికాయతో దిష్టి తీసి నారా లోకేష్‌కు ఎదురు వచ్చారు. అనంతరం లోకేష్ నామినేషన్ వేసేందుకు బయల్దేరి వెళ్లారు.


    తాజా ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. దీంతో లోకేస్ తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. అనేక సమీకరణాల తర్వాత మంగళగిరి నుంచి లోకేష్‌ను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

    కుటుంబ సభ్యులతో నారా లోకేష్


    గతంలో చంద్రబాబు పోటీ చేసిన కుప్పంతో పాటు హిందూపూర్ వంటి స్థానాలు టీడీపికి కంచుకోటలు. ఈ రెండు స్థానాల్లో చంద్రబాబు, బాలకృష్ణ పోటీ తప్పనిసరి అని టీడీపీ భావిస్తోంది. అందుకే మరో స్థానం కోసం వెతికి చివరికి మంగళగిరి కేటాయించారు. ఇక్కడ సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల జనాభా అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు సమీకరణాల్నీ దృష్టిలో పెట్టుకుని లోకేష్‌ను మంగళగిరి నుంచీ బరిలోకి దింపారు.

    nara brahmani
    భర్త లోకేష్‌కు దిష్టి తీస్తున్న నారా బ్రాహ్మాణి
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, AP Politics, Chandrababu naidu, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు