టీటీడీ బోర్డులో శేఖర్ రెడ్డి.. జగన్‌పై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

TTD Board | 2016 నవంబర్ 8న నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి భారీ ఎత్తున నగదును మార్చుకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

news18-telugu
Updated: September 21, 2019, 8:49 PM IST
టీటీడీ బోర్డులో శేఖర్ రెడ్డి.. జగన్‌పై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 21, 2019, 8:49 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడికి శేఖర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ శేఖర్ రెడ్డి మీద గతంలో ఆరోపణలు వచ్చాయి. 2016 నవంబర్ 8న నోట్ల రద్దు సమయంలో ఆయన భారీ ఎత్తున నగదును మార్చుకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సీబీఐ, ఈడీ కూడా ఆయన్ను విచారించాయి. ఆ సమయంలో శేఖర్ రెడ్డి.. నారా లోకేష్‌కు స్నేహితుడంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లోకేష్‌కు భారీగా డబ్బులు ముట్టజెప్పడం వల్లే టీటీడీ బోర్డులో చోటు దక్కిందంటూ అప్పట్లో వైసీపీ ఆరోపించింది. అయితే, అదే శేఖర్ రెడ్డిని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీ బోర్డులో చెన్నై నుంచి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడం వివాదానికి ఆజ్యం పోసింది.

గతంలో తన మీద వైసీపీ చేసిన ఆరోపణలకు ఇప్పుడు నారా లోకేష్ కౌంటర్ ఇస్తున్నారు. ‘అప్పుడు శేఖర్ రెడ్డి అవినీతి అనకొండ అని రాసిన మీ నల్ల పేపర్ ఈ రోజు చెన్నై ఎడిషన్ లో శేఖర్ రెడ్డిని ఆకాశానికి ఎత్తింది. ఉన్నట్టుండి శేఖర్ రెడ్డి సచ్చీలుడు, దైవ చింతన ఉన్న వ్యక్తిగా ఎలా మారిపోయాడో జగన్ గారు చెప్పాలి.’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ‘36 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేసిన మీకు, స్థానికత, రిజర్వేషన్లు గుర్తురాలేదా? 75 శాతం స్థానికత, 50 శాతం రిజర్వేషన్లు కేవలం కలరింగ్ మాత్రమే అని టీటీడీ బోర్డు ఏర్పాటుతో తేలిపోయింది. అసెంబ్లీలో బిల్లు పెట్టేప్పుడు గుర్తున్న బీసీలు పదవుల కేటాయింపుల్లో ఎందుకు గుర్తుండటం లేదు?’ అని లోకేష్ ప్రశ్నించారు.
First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...