Home /News /politics /

NARA LOKESH QUESTIONED CM JAGAN MOHAN REDDY OVER CORRUPTION IN AP PROJECTS SB

ఏపీ ప్రాజెక్టులపై సీఎం జగన్‌ను ప్రశ్నిస్తూ నారా లోకేష్ ట్వీట్

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.

    ఏపీలో ప్రాజెక్టులపై గతం ప్రభుత్వ హయాంలో అవనీతి జరిగిందన్న ఆరోపణలపై మండిపడ్డారు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్. ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్‌ను ప్రశ్నిస్తూ ఆయన ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన Rs.55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైసీపీ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం చంద్రబాబుగారు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు అన్నారు లోకేష్. ఇప్పటికైనా బీజేపీ వైకాపా నాయకులు టీడీపీ మీద బురదజల్లడం మాని, మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెడితే మంచిదంటూ మరో ట్వీట్ పెట్టారు లోకేష్.

    ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. తనను కూడా అవినీతి విషయంలో కళ్లు మూసుకోండంటూ తనపైనా ఒత్తిడి తెచ్చారంటూ హాట్‌ కామెంట్స్ చేశారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్న జగన్‌ పారదర్శక పాలనతో దేశానికే ఆదర్శంగా నిలుద్దామంటూ మరోసారి అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. పలు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందన్నారు. అవినీతి కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారైందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.



    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Chandrababu naidu, Nara Lokesh, Tdp

    తదుపరి వార్తలు