Home /News /politics /

NARA LOKESH PUBLICITY STUNT SAYS VIJAYASARI REDDY AND TWEETS A PHOTO BA

‘వరద నీటిలో వరినాట్లు.. నారా లోకేష్ పబ్లిసిటీ పాట్లు’

ఈ ఫొటోను పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి

ఈ ఫొటోను పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఫొటోను ట్వీట్ చేశారు. అందులో నారా లోకేష్ వరద నీటిలో నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో వరినాట్లు ఉన్నాయి.

    టీడీపీ నేత నారా లోకేష్ మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ఫొటోలను అందులో పొందుపరిచారు. గతంలో చంద్రబాబునాయుడు పొడి నేలలో వరినాట్లు వేస్తే, నారా లోకేష్ తాజాగా వరద నీటిలో వరినాట్లు వేస్తూ పబ్లిసిటీ కోసం పాట్లు పడుతున్నారంటూ విజయసాయిరెడ్డి వెటకారం చేశారు. సైరా పంచ్ పేరుతో ఆయన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. దీంతోపాటు మరో ఫొటోను కూడా విజయసాయిరెడ్డి ట్వీట్  చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఇప్పుడు టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకున్న విజయసాయిరెడ్డి.. ‘23 మంది ఎమ్మెల్యేలను కొన్నాం. ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. ఈ పాపిష్టిలోకం కొనటం తప్పు అంటుంది నాన్నారూ’ అని లోకేష్ అంటున్నట్టుగా ఫోటోను పోస్ట్ చేశారు.



    అయితే, నారా లోకేష్ వరద నీటిలో వరినాట్లు వేస్తున్నారా? లేకపోతే వరదలో నీటిలో మునిగిన వరినాట్లను పరిశీలిస్తున్నారా? అనేది తెలియలేదు. అయితే, ఇవి వరదల్లో నష్టపోయిన పంటను పరిశీలించడానికి వెళ్లినప్పుడు తీసిన వీడియో అని ఓ నెటిజన్ వీడియోను పోస్ట్ చేశాడు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Nara Lokesh, Vijayasai reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు