లోకేశ్‌కు ఊరట.. నామినేషన్ పత్రాలను ఆమోదించిన అధికారులు

Nara Lokesh Nomination Accepted : ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. తమ నియోజకవర్గం ఏ జిల్లా కిందకు వస్తుందో.. అదే జిల్లా చిరునామాతో నోటరీని సమర్పించాలి. అయితే లోకేశ్ మాత్రం కృష్ణా జిల్లా చిరునామాతో నోటరీ సమర్పించడంతో అధికారులు తిరస్కరించారు.

news18-telugu
Updated: March 29, 2019, 3:57 PM IST
లోకేశ్‌కు ఊరట.. నామినేషన్ పత్రాలను ఆమోదించిన అధికారులు
నారా లోకేశ్(File)
  • Share this:
నారా లోకేశ్ నామినేషన్‌పై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నోటరీ విషయంలో తలెత్తిన సమస్యతో లోకేశ్ నామినేషన్‌కు తిరస్కరణకు గురవుతుందా? అన్న సందేహాలు తలెత్తాయి. అయితే ఎన్నికల అధికారులు ఇచ్చిన గడువు లోగా లోకేశ్ సరైన నోటరీ ఫామ్‌ను సమర్పించడంతో.. ఆయన నామినేషన్‌కు ఆమోద ముద్ర పడింది. దీంతో లోకేశ్‌తో పాటు కార్యకర్తలకు ఊరట కలిగినట్టయింది.

కాగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. తమ నియోజకవర్గం ఏ జిల్లా కిందకు వస్తుందో.. అదే జిల్లా చిరునామాతో నోటరీని సమర్పించాలి. అయితే లోకేశ్ మాత్రం
కృష్ణా జిల్లా చిరునామాతో నోటరీ సమర్పించడంతో అధికారులు తిరస్కరించారు. జరిగిన తప్పిదంపై లోకేశ్ తరుపున నోటరీ ఇచ్చిన కృష్ణా జిల్లా న్యాయవాది సీతారామ్.. అధికారులకు వివరణ ఇవ్వడంతో.. 24గంటలు గడువు ఇచ్చారు. దీంతో మంగళవారం తప్పును సరిదిద్దుకుని లోకేశ్ మరోసారి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

లోకేశ్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన అధికారులు.. ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, తప్పుడు చిరునామాతో పత్రాలు సమర్పించినందుకు లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలని మంగళగిరి అభ్యర్థి ఆర్కేతో పాటు వైసీపీ నేతలు అధికారులను డిమాండ్ చేశారు. అయితే మొత్తం మీద లోకేశ్‌ నామినేషన్‌కు ఆమోద ముద్ర పడటంతో టీడీపీ కార్యకర్తలు ఊరట లభించినట్టయింది.

(నారా లోకేశ్ నామినేషన్..)
First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>