ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ ?

ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి నుంచి కళా వెంకట్రావును తప్పించి... ఆ స్థానంలో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నియమిస్తామరనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: June 9, 2020, 1:28 PM IST
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ ?
సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.
  • Share this:
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలంటే... చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పార్టీలో మరింత కీలకమైన పదవి ఇవ్వాలనే వాదన కూడా చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వొచ్చనే టాక్ కూడా టీడీపీలో వినిపిస్తోంది. తాజాగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించిన మంత్రి అవంతి శ్రీనివాస్... ఓటమికి లోకేష్ కారణమని ఆరోపించారు. అంతేకాదు పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుని ఎందుకు తప్పిస్తారని అన్నారు. లోకేష్ వల్లే టీడీపీకి నష్టమని.. ఆయన నాయకత్వంలో నడుస్తామని విశాఖ జిల్లాలోని ఒక ఎమ్మెల్యే తో చెప్పించగలరా అని వ్యాఖ్యానించారు. లోకేష్ వెనుక భజన బ్యాచ్ ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ, నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించిన మంత్రి అవంతి శ్రీనివాస్... త్వరలోనే నారా లోకేశ్ ఏపీ టీడీపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు.

ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి నుంచి కళా వెంకట్రావును తప్పించి... ఆ స్థానంలో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నియమిస్తామరనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీపై విమర్శలు చేసే అచ్చెన్నాయుడుకు ఈ కీలక పదవి దాదాపు ఖాయమైందనే ప్రచారం టీడీపీ వర్గాల్లోనూ జోరుగా సాగింది. అయితే తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కళా వెంకట్రావును తప్పించి నారా లోకేశ్‌ను ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేసే అవకాశం ఉందనేలా సంకేతాలు ఇవ్వడంతో... టీడీపీలో అలాంటి ప్రయత్నాలు జరుగున్నాయేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Published by: Kishore Akkaladevi
First published: June 9, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading