ప్రతీక్షణం నీ ప్రేమలోనే... పెళ్లిరోజున నారా లోకేష్ ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణ తనయ బ్రాహ్మణిణి 2007 ఆగస్టు 26న వివాహం చేసుకున్నారు.

news18-telugu
Updated: August 26, 2019, 3:07 PM IST
ప్రతీక్షణం నీ ప్రేమలోనే... పెళ్లిరోజున నారా లోకేష్ ట్వీట్
నారా బ్రాహ్మణి,నారా లోకేష్
news18-telugu
Updated: August 26, 2019, 3:07 PM IST
పెళ్లి రోజు సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తన సతీమణి నారా బ్రాహ్మణితో దాంపత్య జీవితానికి 12 ఏళ్లు పూర్తయ్యాయని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బ్రాహ్మణితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. బ్రాహ్మాణితో పెళ్లైనప్పటి నుంచి తనకున్న అనుబంధాన్ని, ప్రేమను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘12 సంవత్సరాలు, 144 నెలలు, 4,383 రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు, 37,86,91,200 సెకన్లు. ప్రతి క్షణం నీ ప్రేమలోనే. ఇన్నేళ్ల కాలంలో నిన్ను నేను ప్రేమించకుండా ఉన్న క్షణం అంటూ లేదు. హ్యాపీ యానివర్సరీ బ్రాహ్మణి" అంటూ ట్వీట్ చేశారు లోకేష్. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణ తనయ బ్రాహ్మణిల వివాహం 2007 ఆగస్టు 26న జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలైన నారా బ్రాహ్మణి హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె టీడీపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. బ్రాహ్మణి, లోకేష్‌లకు నాలుగేళ్ల కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నాడు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...