‘మిడతల విషయంలో కరోనాలా చేయొద్దు’

మిడతల దండు ప్రభావం భయంకరంగా ఉందని... కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్లతో పురుగుమందు పిచికారీ సూచించటంతో పాటు రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసిందని నారా లోకేశ్ సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

news18-telugu
Updated: May 29, 2020, 7:05 PM IST
‘మిడతల విషయంలో కరోనాలా చేయొద్దు’
నారా లోకేష్ (File)
  • Share this:
మిడతల ముప్పును నివారించడంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ సీఎ జగన్‌కు టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్ లేఖ రాశారు. మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై దాడి చేసిందని... మహారాష్ట్ర నుంచి ఆ దండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని లోకేశ్ లేఖలో ప్రస్తావించారు. అనంతపురంలోని రాయదుర్గంలో మిడతలు ప్రవేశించాయనే వార్తలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణను తేలిగ్గా తీసుకోవడంతో ఇప్పటికే చాలా నష్టం వాటిల్లిందని... పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలు రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీశాయని అన్నారు.

మిడతల దండు ప్రభావం భయంకరంగా ఉందని... కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్లతో పురుగుమందు పిచికారీ సూచించటంతో పాటు రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హెచ్చరికలు, పొరుగు రాష్ట్రాల విధానాలు పట్టించుకోకుండా ఏడాది వేడుకలు, పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ముంచుకొచ్చే ప్రమాదం నివారణకు రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు ఎక్కడా కనిపించడం లేదని... వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేసి రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని సూచించారు. పరిస్థితిని అధ్యయనం చేయటానికి జిల్లా యంత్రాగాన్ని సిద్ధం చేయాలని అన్నారు. మిడతల ప్రభావిత రాష్ట్రాలు, దేశాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతికతను వినియోగించుకుంటూ పరిష్కారాలు చేపట్టాలని లేఖ ద్వారా సీఎం జగన్‌ను కోరారు.
First published: May 29, 2020, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading