ఇలాంటి ట్రెండ్ సెట్ చేస్తారనుకోలేదు.. నారా లోకేష్ లేఖ.. ఎవరికంటే..

‘అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఏ ఒక్క అంశంలోనైనా నాకు సంబంధం ఉంద‌ని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా’ అని నారా లోకేష్ సవాల్ చేశారు.

news18-telugu
Updated: November 8, 2019, 7:55 PM IST
ఇలాంటి ట్రెండ్ సెట్ చేస్తారనుకోలేదు.. నారా లోకేష్ లేఖ.. ఎవరికంటే..
నారా లోకేష్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబునాయుడి మీద తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌తో సంబంధంలేదని చంద్రబాబు ప్రకటించగలరా? అని తమ్మినేని ప్రశ్నించారు. చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మొదట ఎమ్మెల్యేనని, ఆ తర్వాతే స్పీకర్ అని చెప్పారు.

తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బహిరంగ లేఖ రాశారు. ‘మీ విద్యార్హ‌త‌లు, రాజ‌కీయానుభ‌వం స్పీక‌ర్ ప‌ద‌వికే వ‌న్నె తెస్తాయని ఆశించాను. విలువలతో సభని హుందాగా నడిపిస్తా అని మీరు మాట్లాడిన మాటలు నన్నెంతో ఆక‌ట్టుకున్నాయి. విలువలతో సభ నడిపించి ట్రెండ్ సెట్ చేస్తా అన్న మీరు స్పీకర్ పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్ సెట్ చేస్తారని అనుకోలేదు. ఎనిమిదిసార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికై, ముఖ్య‌మంత్రిగా, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌నిచేసి విజ‌న‌రీ లీడ‌ర్‌గా ఉన్న చంద్ర‌బాబు గురించి 'గుడ్డలూడ‌దీయిస్తా' అంటూ మీరు చేసిన వ్యాఖ్య‌లు మీ స్పీక‌ర్ స్థానాన్ని చిన్న‌బుచ్చేలా ఉన్నాయి.’ అని నారా లోకేష్ లేఖలో ఆరోపించారు.

‘అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఏ ఒక్క అంశంలోనైనా నాకు సంబంధం ఉంద‌ని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. ఒక‌వేళ మీరు చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వాల‌ని తేలితే..మీరేం చేస్తారో కూడా చెప్పాల‌ని ఈ బ‌హిరంగ లేఖ ద్వారా స‌వాల్ విసురుతున్నాను.’ అని నారా లోకేష్ సవాల్ చేశారు.
First published: November 8, 2019, 7:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading