పల్లె వెలుగు బస్సు ఎక్కిన నారా లోకేష్

టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి మంగళగిరి నుంచి ఏపీ అసెంబ్లీ వరకూ బస్ లో లోకేష్ ప్రయాణించారు.

news18-telugu
Updated: December 11, 2019, 9:54 AM IST
పల్లె వెలుగు బస్సు ఎక్కిన నారా లోకేష్
Video : పల్లె వెలుగు బస్సులో నారా లోకేష్ ప్రయాణం..
  • Share this:
మంగళగిరి బస్టాండ్ వద్ద లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి మంగళగిరి నుంచి ఏపీ అసెంబ్లీ వరకూ బస్ లో లోకేష్ ప్రయాణించారు. పెంచిన ధరలు, పెరిగిన భారం గురించి ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. 15 కిలోమీటర్లకు పెంచిన రేటు ప్రకారం ఛార్జీలు రూపాయిన్నర పెరగాలి కానీ ... ఐదు రూపాయిలు అధికంగా వసూలు చేస్తున్నారు అని లోకేష్ దృష్టికి ప్రయాణికులు తీసుకొచ్చారు. సంవత్సరానికి రూ. 700 నుండి రూ.. 1000 కోట్ల భారం ప్రజల పై పడుతుందన్నారు. పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకూ పోరాటం చేస్తామన్నారు. పెంచుకుంటూ పోతాం అని జగన్ గారు చెబుతుంటే ప్రజలంతా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అనుకున్నారు. కానీ జగన్ గారు ఇసుక ధర, ఆర్టీసీ ధరలు పెంచుకుంటూ పోతున్నారన్నారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేస్తారన్నారు జగన్.


First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>