వైసీపీ సభకు సునామీలా జనం... నారా లోకేష్ ట్వీట్

నారావారిపల్లిలో వైసీపీ నిర్వహించిన సభలో జనం మాత్రం అసలు కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ పలు మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి.

news18-telugu
Updated: February 3, 2020, 10:18 AM IST
వైసీపీ సభకు సునామీలా జనం... నారా లోకేష్ ట్వీట్
నారా లోకేష్ (File)
  • Share this:
మూడు రాజధానులకు మద్దతు తెలిపేందుకు చంద్రబాబు సొంతూరును ఎంచుకున్న వైసీపీ నేతలు అక్కడ ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు సమీపంలోని రంగపేటలో ఈ సభను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే ఈ అంశంపై ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతల వరుస ఆందోళనలతో నారావారిపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ సభకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈసభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే జనం మాత్రం అసలు కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ పలు మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి. దీంతో ఆ సభకు సంబంధించిన విజువల్స్ వీడియో పోస్టు చేశారు.. మాజీ మంత్రి నారా లోకేష్. ‘జప్ఫాలు... ఇది వాస్తవం’ అంటూ ట్వీట్ చేశారు.అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు. వైసీపీ సభకు సునామీలాగా వచ్చిన జనం అంటూ మరో వీడియోను కూడా చూపిస్తున్న నారా లోకేష్ పోస్టు చేశారు. అయితే ఆ వీడియోలో కూడా ఖాళీగా ఉన్న కుర్చీలే కనిపిస్తున్నాయి.

ఆదివారం రంగంపేటలో వైసీపీ సభలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు కల్లాం అజయ్ రెడ్డి ప్రసంగం తర్వాత ప్రజలు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ తర్వాత కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో తన ప్రసంగాన్ని అజయ్ రెడ్డి మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతుండగా సభ పూర్తిగా ఖాళీ అయ్యింది. జనం భారీగా సభ నుంచి వెళ్లిపోవడంతో చెవిరెడ్డి క్లుప్తంగా మాట్లాడాలంటూ మంత్రి కన్నబాబును కోరారు. తొందరగా ప్రసంగాన్ని ముగించాలన్ని ఆయన అన్నారు.First published: February 3, 2020, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading